విజయవాడలో లాక్ డౌన్ ను భేఖాతరు చేసిన జ్యూయెలర్స్... పోలీసుల సీరియస్!

  • అక్షయ తృతీయ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం
  • స్టోర్ ను తెరచిన ఆంజనేయా జ్యూయెలర్స్
  • యజమానులను అరెస్ట్ చేసిన పోలీసులు
అక్షయ తృతీయ నాడు ప్రజల సెంటిమెంట్ ను ఎలాగైనా క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో, విజయవాడలోని కొన్ని జ్యూయెలర్స్ షోరూములను యాజమాన్యాలు తెరిచాయి. ఇలా షాపులను తెరవడంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. బయటకు షట్టర్లు వేసినట్టు కనిపిస్తున్నా, లోపల విక్రయాలు దర్జాగా సాగిస్తున్నారు. విజయవాడలోని ఆంజనేయా జ్యూయెలరీ ఇదే పని చేసి అడ్డంగా దొరికిపోయింది.

నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆభరణాల దుకాణాలు గత రెండు రోజులుగా రహస్యంగా తీసే ఉంచారన్న వార్తలు వెలువడటంతో, కొన్ని మీడియా చానెళ్లు స్టింగ్ ఆపరేషన్ చేశాయి. వాటి దృశ్యాలు బయటకు రావడంతో పోలీసులు రైడ్స్ చేశారు. ఆంజనేయా జ్యూయెలరీ దుకాణాన్ని సీజ్ చేసి, యజమానులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, తాము ఏదో పనిమీద స్టోర్ తాళాలను తీశామని, విక్రయాలను సాగించడం లేదని షాపు యజమాని వ్యాఖ్యానించడం గమనార్హం.

Anjaneya Jewellers
Vijayawada
Police
Action

More Telugu News